Virat Kohli: బీటెక్ ప్రశ్నాపత్రంలో కోహ్లీపై క్వశ్చన్

A question on Kohli in BTech 2nd year question paper

  • ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడంటూ ప్రశ్న
  • 2008 నుంచి చేస్తున్న పరుగుల ఆధారంగా లెక్కగట్టాలని సూచన
  • వైరల్ అవుతున్న క్వశ్చన్ పేపర్
  • ఆన్సర్లు ఇస్తున్న నెటిజన్లు

టీమిండియా మాజీ సారథి, డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఘనతలు అన్నీ ఇన్నీ కాదు. కరోనా సంక్షోభం సమయంలో ఫామ్ కోల్పోయినా, ఇటీవల మళ్లీ టచ్ లోకి వచ్చిన కోహ్లీ... ఐపీఎల్ లో చెలరేగిపోతున్నాడు. 

ఇక అసలు విషయం ఏమిటంటే... తమిళనాడులో ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రంలో కోహ్లీపై ఓ ప్రశ్న అడిగారు. చెన్నైలోని శివనాడార్ యూనివర్సిటీలో  బీటెక్ సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ సబ్జెక్టులో కోహ్లీ సాధించిన పరుగులు, సాధించబోయే పరుగుల గురించి ఓ ప్రశ్న వచ్చింది. 

2008 నుంచి కోహ్లీ వన్డేల్లో సాధించిన పరుగుల ఆధారంగా, 2023లో ఎన్ని పరుగులు నమోదు చేస్తాడు? అన్నదే ఆ ప్రశ్న. ఆ ప్రశ్నలో... కోహ్లీ 2008 నుంచి 2022 వరకు ప్రతి ఏడాది వన్డేల్లో ఎన్ని పరుగులు చేశాడో వివరం ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. 

ఇంజినీరింగ్ స్టూడెంట్ల విషయం అటుంచితే, ఈ సీజన్ లో కోహ్లీ ఎన్ని పరుగులు సాధిస్తాడో నెటిజన్లే లెక్కలు కట్టి చెప్పేస్తున్నారు. మొత్తమ్మీద 2023 సీజన్ ముగిసేసరికి కోహ్లీ 1150 పరుగుల వరకు సాధిస్తాడని అత్యధికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News