Anushka Shetty: నవ్వులు పూయించే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’

Much awaited Miss shetty mister Polishetty Teaser out
  • ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా కొత్త సినిమా టీజర్
  • చెఫ్ పాత్రలో అనుష్క
  • స్టాండప్ కమెడియన్ గా నవీన్ పొలిశెట్టి
బాహుబలి సినిమాలతో దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. కానీ, అందరిలా స్టార్ డమ్ ని క్యాష్ చేసుకోవడంలో ఆమె వెనుకబడింది. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తోంది. తను చాన్నాళ్ల తర్వాత హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. మూడేళ్ల కిందట వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించిన యువ హీరో నవీన్‌ పొలిశెట్టి హీరో. అనుష్క, నవీన్ ఇంటిపేర్లనే టైటిల్ గా మార్చిన ఈ రొమాంటిక్, కామెడీ చిత్రానికి మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క లాంటి బడా హీరోయిన్ ఓ యువ హీరోతో నటిస్తున్నప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం  ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసింది. ఒక స్టార్ హోటల్ లో చెఫ్‌కు, స్టాండప్‌ కమెడియన్‌కు మధ్య ప్రేమకథను ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో చూపించబోతున్నట్టు టీజర్ లోనే దర్శకుడు స్పష్టం చేశాడు. చెఫ్ పాత్రలో అనుష్క, స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ కనిపించబోతున్నారు. జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క, నవీన్‌తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ల ప్రేమ.. పెళ్ళి వరకు వెళ్తుందా? అనే యాంగిల్ లో దర్శకుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నవీన్‌ మార్కు కామెడీ టైమింగ్‌ తెగ ఆకట్టుకునేలా ఉంది. దాంతో, టీజర్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది.
Anushka Shetty
naveen Polishetty
Miss shetty mister Polishetty
teaser

More Telugu News