Vijay Antony: ఆసక్తికరంగా 'బిచ్చగాడు 2' ట్రైలర్.. !

Bichagadu 2 Official Trailer released

  • థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా బిచ్చగాడు ట్రైలర్
  • బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చుట్టూ నడిచే కథ.. 
  • మే 19వ తేదీన విడుదల కానున్న సినిమా

ఎలాంటి అంచనాలు లేకుండా 2016లో తెలుగులో రిలీజైన ‘బిచ్చగాడు’ సినిమా సంచలన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’తో హీరో విజయ్ ఆంటోని మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. 

థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. విజయ్ ఆంటోని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ట్రైలర్ చూస్తుంటే బిచ్చగాడు 2తో విజయ్ మరోసారి తన మార్క్ చూపించేటట్లు కనిపిస్తున్నారు. ‘యాంటీ బికిలి’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.

నిజానికి బిచ్చగాడు సినిమా అంతా అమ్మ సెంటిమెంట్ పైనే నడుస్తుంది. ఆ సినిమా ఘన విజయం సాధించడానికి కారణం కూడా ఆ పాయింటే. కానీ ఇందులో కథాంశం వేరు. మొత్తం బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 

సంగీత దర్శకుడి నుంచి యాక్టర్‌గా మారిన మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని తీసిన సినిమాలన్నీ కాస్త భిన్నంగానే ఉంటాయి. ఈ చిత్రానికి ఆయనే హీరో, డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. కథా రచనలోనూ ఆయన భాగమయ్యారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా.. మే 19కి వాయిదా పడింది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌ మీరూ చూడండి.

More Telugu News