Corona Virus: భారత్‌లో కొత్తగా 7,171 కరోనా కేసులు
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 51,314
- రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతం
- దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనాతో 40 మంది మృతి
- వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 7,171 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా, వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 4.72 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా (300) తగ్గిందని పేర్కొంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 40 మంది కరోనాతో మరణించారు. ఒక్క కేరళలోనే 15 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో నలుగురు, చత్తీస్‌ఘడ్‌లో ముగ్గురు మృతిచెందారు. హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో చెరో ఇద్దరు, మేఘాలయ, జమ్మూకశ్మీర్, పంజాబ్, చండీఘడ్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 51,314 అని కేంద్రం వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.07 శాతమని, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ప్రకటించింది.