Kiran Abbavaram: నెట్ ఫ్లిక్స్ లో 'మీటర్' మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Meter movie will release in Netflix

  • కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'మీటర్'
  • కథానాయికగా అతుల్య రవి పరిచయం
  • థియేటర్స్ లో ఆశించినస్థాయిని అందుకోలేకపోయిన సినిమా  
  • నెట్ ఫ్లిక్స్ లో మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్

కిరణ్ అబ్బవరం హీరోగా రమేశ్ దర్శకత్వంలో ఈ నెల 7వ తేదీన 'మీటర్' సినిమా వచ్చింది. చిరంజీవి - హేమలత నిర్మించిన ఈ సినిమాకి, సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాతోనే తెలుగు తెరకి కథనాయికగా అతుల్య రవి పరిచయమైంది. అలాంటి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ గా తన తండ్రికి ఎదురవుతూ వచ్చిన అవమానాలను చూస్తూ పెరిగిన హీరో, ఆ జాబు మాత్రం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. కాలం కలిసొచ్చి ఆ జాబ్ వస్తే కూడా మానేయాలని అనుకుంటాడు. అలాంటి అతను పోలీస్ జాబ్ లోనే ఉండిపోవాలనేంతగా మార్చిన సంఘటన ఏది? అనేదే కథ. 

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. అలాంటి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. మరి ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి. 

More Telugu News