Supreme Court: విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదు చేయాల్సిందే: సుప్రీంకోర్టు

SC orders on hate speeches

  • విద్వేష ప్రసంగాలను కట్టడి చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం
  • ఫిర్యాదులు రాకున్నా సుమోటోగా కేసులు పెట్టాలని స్పష్టీకరణ
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు
  • విద్వేష ప్రసంగాలు దేశ లౌకిక నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యలు
  • కేసులు పెట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కరణగా భావిస్తామని వెల్లడి

దేశంలో విద్వేష ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక ఉత్వర్వులు ఇచ్చింది. విద్వేష ప్రసంగాలు చేసేవారిపై కేసులు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిర్యాదులు రాకున్నా సుమోటోగా కేసులు పెట్టాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

కేసుల నమోదులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దేశ లౌకిక నిర్మాణాన్ని విద్వేష ప్రసంగాలు దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. విద్వేష ప్రసంగం అనేది తీవ్రమైన నేరం అని అభివర్ణించింది. పలు విద్వేష ప్రసంగాల కేసుల విచారణ సందర్భంగా సుప్రీం ఈ మేరకు పేర్కొంది.

Supreme Court
Hate Speeches
Case
States
Union Territories
India
  • Loading...

More Telugu News