Raghu Rama Krishna Raju: సీఎం జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన రఘురామకృష్ణరాజు

raghu raju fires on Jagan

  • ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విచ్చేసిన రజనీకాంత్
  • రజనీ రావడం సంతోషించదగ్గ విషయమన్న రఘురాజు
  • అందరినీ సార్ అని పిలిచే గొప్ప వ్యక్తిత్వమని కితాబు

స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏపీలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ వేడుకలకు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. ప్రతి వ్యక్తిని సార్ అని పిలిచే గొప్ప వ్యక్తిత్వం రజనీ సొంతమని ప్రశంసించారు. నిన్న కాక మొన్న సీఎం అయిన వ్యక్తి ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలుస్తున్నారంటూ పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. 

మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి అంకురార్పణ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రజనీకి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకి బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఎలా ఉండగలనని రజనీ అన్నారు.

Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Rajinikanth
Balakrishna
Telugudesam
  • Loading...

More Telugu News