Jogi Ramesh: ‘ఏయ్.. ముందు పక్కకు జరుగు..’.. డీఎస్పీపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం!

jogi ramesh fired on dsp in minister roja visit
  • మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటన
  • స్వాగతం పలికిన మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే పేర్ని నాని
  • డీఎస్పీ మాన్షూ బాషాపై విసుక్కున్న జోగి రమేశ్
మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ పై సీరియస్ అయ్యారు. పదుల సంఖ్యలో అధికారులు, లీడర్ల మధ్యలో డీఎస్పీపై విసుక్కున్నారు. ‘ఏయ్ పక్కకెళ్లు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. 

ఈ రోజు మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటించారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సమయంలో పలువురు నాయకులు రోజాకు పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. ఒక్కో లీడర్ ను మంత్రి రోజాకు పేర్ని నాని పరిచయం చేశారు.

ఈ క్రమంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. అయితే ఎస్పీకి అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలని డీఎస్పీ మాన్షూ బాషా కోరారు. డీఎస్పీ చేయి తనకు తగలడంతో ‘పక్కకు వెళ్లు ముందు’ అంటూ ఆయనపై మంత్రి ‌జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్షూ బాషా వైపు కోపంగా చూశారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jogi Ramesh
Roja
machilipatnam
Perni Nani
DSP

More Telugu News