: శ్రీచైతన్య, నారాయణ సంస్థలపై ఈటెల ఆరోపణలు
తల్లిదండ్రుల బలహీనతల ఆధారంగా ప్రైవేటు స్కూళ్ళు , కాలేజీలు భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు విద్యార్ధుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని మండి పడ్డారు. ఈ కళాశాలల్లో విద్యాబోధన ఒకేలా ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యాహక్కు చట్టాలు తెస్తూ ఉచిత విద్యను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని మండిపడ్డారు. ఫీజులను నియంత్రించకపోతే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.