Telangana: అలర్ట్.. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు

IMD forecast rains in telangana in the next two days

  • పశ్చిమ విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి
  • ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఉత్తరాది జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
  • తూర్పున ఉన్న  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్లవానకు అవకాశం
  • వాతావరణ శాఖ వెల్లడి

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.  

రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం నల్లగొండలో గరిష్ఠంగా 37.0 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-40 డిగ్రీల మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News