Sai Dharam Tej: అతడికి కారు, బైకు, బంగ్లా, డబ్బు ఇచ్చామన్న వార్తల్లో నిజంలేదు: సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej condemns rumors

  • 2021లో రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్
  • సకాలంలో ఆసుపత్రిలో చేర్చేందుకు సాయపడిన అబ్దుల్ ఫర్హాన్
  • అతడికి మెగా ఫ్యామిలీ నజరానాలు ఇచ్చిందంటూ ప్రచారం
  • ఖండించిన సాయిధరమ్ తేజ్
  • అతడికి జీవితాంతం రుణపడి ఉంటామని వెల్లడి

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నుంచి సుదీర్ఘ విరామం తర్వాత విరూపాక్ష చిత్రం వచ్చింది. హస్ ఫుల్ కలెక్షన్లతో తన చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుండడాన్ని సాయిధరమ్ తేజ్ ఆస్వాదిస్తున్నారు. అయితే, తమ కుటుంబం గురించి మీడియాలో వస్తున్న కొన్ని కథనాల పట్ల ఆయన స్పందించారు. 

రెండేళ్ల కిందట తాను రోడ్డు ప్రమాదానికి గురికాగా, సకాలంలో గుర్తించి ఆసుపత్రిలో చేర్చేందుకు సాయపడిన అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తికి మెగా ఫ్యామిలీ రూ.1 లక్ష డబ్బు, కారు, బంగ్లా, బైకు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 

ఓ రకంగా ఆ వ్యక్తి తనకు పునర్జన్మ ఇచ్చాడని, అలాంటి వ్యక్తికి రూ.1 లక్ష ఇచ్చి సరిపెట్టుకోలేమని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అబ్దుల్ ఫర్హాన్ ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా అడగొచ్చని, అతడికి తమ టీమ్ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చామని తెలిపారు. 

తమ కుటుంబం నుంచి అతడికి ఎవరైనా సాయం చేశారేమో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఈ విషయం తాను ఎవరి వద్ద ప్రస్తావించలేదని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.

Sai Dharam Tej
Road Accident
Abdul Farhan
Hyderabad
Mega Family
Tollywood
  • Loading...

More Telugu News