Sri Vishnu: 'సామజ వర గమన' నుంచి టీజర్ రిలీజ్!

Samajavaragamana Teaser Released

  • శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'సామజ వర గమన'
  • కథానాయికగా రెబా మోనిక జాన్
  • సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్ 
  • మే 18వ తేదీన సినిమా విడుదల

శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సామజ వర గమన' మే 18వ తేదీన థియేటర్లకు రానుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రెబా మోనిక జాన్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సాధారణంగా తమ వెంటపడి వేధించే అబ్బాయిలతో అమ్మాయిలు రాఖీ కట్టించుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాలో హీరో రాఖీలు జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. తన వెంటపడిన అమ్మాయిలతో స్పాట్ లోనే రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. అందుకు కారణం ఏమిటనేదే కథ. 

టీజర్ చూస్తేనే శ్రీవిష్ణు పాత్ర ద్వారా కావలసినంత కామెడీని అందించనున్నారని తెలుస్తోంది. ఇక లోకల్ మాస్ పార్టీ లీడర్ లుక్ తో వెన్నెల కిశోర్ కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర హాయిగా నవ్విస్తుందనే విషయం అర్థమవుతోంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా శ్రీవిష్ణుకి హిట్ ఇస్తుందేమో చూడాలి మరి.

Sri Vishnu
Reba John
Samajavaragamana Movie

More Telugu News