Kevin Pietersen: ఎలా చేజ్ చేయాలో ధోనీని చూసి నేర్చుకోండి: కెవిన్ పీటర్సన్

MS Dhoni used to say take the game deep Kevin Pietersen urges batters to learn CSK captain chasing mantra

  • బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సూచన
  • 200 పరుగులు చేరుకోవాలంటే చివరి వరకు కొనసాగాలన్న అభిప్రాయం
  • 12 లేదా 13వ ఓవర్లోనే గెలిచేయాలనుకోకూడదని వ్యాఖ్య 

మహేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ)ని చూసి ఎలా చేజ్ చేయాలో యువ క్రికెటర్లు నేర్చుకోవాలంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సూచించారు. భవిష్యత్తులో మ్యాచులను ఎలా ముగించాలన్న మంత్రాన్ని ధోనీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. 200 పరుగుల లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు తగ్గ ప్రదర్శన ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ ను ఉద్దేశించి కెవిన్ పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు ఆర్సీబీ ముందు 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. టాస్ గెలిచినప్పటికీ కోహ్లీ బ్యాటింగ్ తీసుకోవడానికి మంచు ప్రభావమే కారణం. కోహ్లీ అంచనాలకు తలకిందులై, ఆర్సీబీ పోరు 179 వద్దే ఆగిపోయింది. కీలక ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ ఎక్కువ సేపు నిలవకపోవడంతో బెంగళూరు చాప చుట్టేసింది. దీంతో కెవిన్ పీటర్సన్ ఆర్సీబీ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. 

‘‘చేజింగ్ లో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. వారు 200 లక్ష్యాన్ని చూస్తూ.. 12 లేదా 13వ ఓవర్ లోనే గెలిచేయాలని అనుకున్నారు. అద్భుతమైన క్యాచ్ తో కోహ్లీ దొరికిపోయాడు. గేమ్ తీరే అంత. ఎంఎస్ ధోనీ ఎప్పుడూ గేమ్ ను చివరి వరకూ తీసుకెళ్లాలని చెబుతుంటాడు. అది 18వ ఓవర్ లేదా 19వ ఓవర్ లేదా 20వ ఓవర్ కావచ్చు’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. ధోనీ చేజంగ్ మంత్ర అంటే.. ఆటను గెలవాలంటే ఆటగాళ్లు ఓపికతో చివరి వరకు కొనసాగేలా చూసుకోవాలి. పేలవంగా వేస్తున్న బౌలర్లపై విరుచుకుపడాలి. ఆందోళన చెందకుండా, బలహీనంగా వేసిన బంతులను చీల్చి చెండాడాలి. ప్రత్యర్థిని గౌరవించాలి. ఇవే ధోనీ అనుసరించేవి. వీటినే పీటర్సన్ గుర్తు చేశాడు.

  • Loading...

More Telugu News