: తిరుమలలో భారీ వర్షం.. భక్తుల ఇక్కట్లు
ప్రముఖ ఆధ్మాత్మిక కేంద్రం తిరుమలను ఈ సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. తిరుమాడ వీధులు జలమయ్యాయి. దీంతో, శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచియున్న భక్తులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. కాగా, నైరుతి రుతుపవనాలు నేడు రాయలసీమలో ప్రవేశించడంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ విభాగం తెలిపింది.