Raj Nath Singh: అవినీతికి పాల్పడిన వ్యక్తి ఎంత పెద్ద నాయకుడైనా వదిలే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్

We will not spare corrupted leaders says Raj Nath Singh
  • అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న రాజ్ నాథ్ 
  • పెద్ద నాయకులు కూడా జైలుకు పోతున్నారని వ్యాఖ్య
  • గత 9 ఏళ్లలో రూ. 1.10 లక్షల కోట్లను మనీ లాండరింగ్ చట్టం కింద సీజ్ చేశారన్న రక్షణ మంత్రి
కర్ణాటకల ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని బీజేపీ సమర్థించదని... ఎంతటి పెద్ద నాయకుడైనా అవినీతికి పాల్పడితే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామని... పెద్ద నాయకులు కూడా జైలుకు పోతున్నారని చెప్పారు. 

అయితే రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. ఈ దేశంలో అవినీతిని అంతం చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత 9 ఏళ్లలో 1.10 లక్షల కోట్లను మనీ లాండరింగ్ చట్టం కింద సీజ్ చేశారని చెప్పారు. యూపీఏ హయాంలో 10 ఏళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లను మాత్రమే సీజ్ చేశారని విమర్శించారు.  

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజ్ నాథ్ విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ మతపరమైన కోటాను ఇచ్చిందని మండిపడ్డారు. ధార్వాడ్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Raj Nath Singh
BJP
Karnataka

More Telugu News