India: రాఫెల్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా ఫైలట్ శివాంగి మరో ఘనత
- ఫ్రాన్స్ లో పలు దేశాల యుద్ధ విన్యాసాల్లో పాల్గొనే భారత బృందంలో చోటు
- ఎయిర్ డామినెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపి చరిత్ర సృష్టించనున్న శివాంగి
- 2017లో భారత వాయుసేనలో చేరిన శివాంగి సింగ్
రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా పైలట్ గా రికార్డు సృష్టించిన శివాంగి సింగ్ మరో ఘనత సాధించనున్నారు. ఫ్రాన్స్‌లోని ఓరియన్ లో వివిధ దేశాల ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనే భారత వైమానిక దళ బృందంలో చోటు దక్కించుకున్నారు. రాఫెల్ స్క్వాడ్రన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయిన శివాని ఇప్పుడు బహుళ-పాత్ర ఎయిర్ డామినెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపి చరిత్ర సృష్టించనున్నారు.
శివాంగి సింగ్ 2017లో భారత వైమానిక దళంలో చేరారు. ఐఏఎఫ్ రెండవ బ్యాచ్ మహిళా ఫైటర్ పైలట్ బృందంలో చేరిన ఆమె రాఫెల్‌ను నడపడానికి ముందు మిగ్-21 బైసన్ విమానాన్ని కూడా నడిపారు. వారణాసికి చెందిన శివాంగి ప్రస్తుతం కన్వర్షన్ శిక్షణ పొందుతున్నారు. త్వరలో హర్యానాలోని అంబాలా నుంచి ఐఏఎఫ్ లో అత్యంత కీలకమైన గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్‌లో భాగం అవనున్నారు. 2020లో అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత శివాంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచారు.