Samantha: ఏపీలో సమంతకు గుడి.. ఎక్కడంటే..!

Samantha temple in AP

  • బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని
  • తన ఇంటి ఆవరణలో గుడి కట్టిస్తున్న వైనం
  • ఈ నెల 28న ప్రారంభమవుతున్న గుడి

తమ అభిమాన నటీనటులకు గుడి కట్టి ఆరాధించడం తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా ఆ ట్రెండ్ మొదలయింది. సమంతపై ఉన్న అంతులేని అభిమానంతో ఆమెకు ఓ అభిమాని గుడి కట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. నటిగా ఆమెను ఎంతో ఆరాధించే సందీప్.. ఆమె చేసే పలు సేవా కార్యక్రమాలకు మరింత ఆకర్షితుడయ్యాడు.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండటంలో ఆమె చూపిస్తున్న చొరవకు ఆయన అభిమానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమెకు గుడి కట్టించాలని సంకల్పించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదని... కానీ, ఆమెపై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని చెప్పాడు. ఈ నెల 28న గుడిని ప్రారంభిస్తున్నానని తెలిపాడు.

Samantha
Tollywood
Temple
  • Loading...

More Telugu News