BTech Ravi: రక్తపు మరకలు తుడిచిన అవినాశ్ రెడ్డి గురించి జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు: బీటెక్ రవి

BTech Ravi comments on YS Avinash Reddy

  • అవినాశ్ పై సీబీఐకి కక్ష ఎందుకుంటుందన్న బీటెక్ రవి
  • తప్పు చేశాడు కాబట్టే సీబీఐ దోషి అంటోందని వ్యాఖ్య
  • సునీతకు తప్పకుండా న్యాయం జరుగుందన్న రవి

తన అన్న జగన్ సీఎం పదవిని, తన ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు అవినాశ్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడనే విషయం ఆయన మాటల్లోనే అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వివేకాను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలను తుడిచిన అవినాశ్ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సీబీఐ కుట్రపూరితంగా తనను ఇరికిస్తోందని అవినాశ్ చెపుతున్నాడని... ఆయనపై సీబీఐకి కక్ష ఎందుకుంటుందని ప్రశ్నించారు. తప్పు చేశాడు కాబట్టే సీబీఐ దోషి అంటోందని వ్యాఖ్యానించారు. 

అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయమని... సునీతకు తప్పకుండా న్యాయం జరుగుతుందని బీటెక్ రవి చెప్పారు. వివేకా హత్యతో టీడీపీకి సంబంధం లేదని... తమపై నిందలు మోపి రాజకీయంగా జిల్లాలో తిరగాలని అవినాశ్ చూస్తున్నాడని మండిపడ్డారు. నీ మంచితనం గురించి ప్రజలకు తెలియడానికి నీవేమీ పుచ్చలపల్లి సుందరయ్యవు కాదని ఎద్దేవా చేశారు.

BTech Ravi
Telugudesam
YS Avinash Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News