Gopichand: 'రామబాణం' సినిమాకి ఆ రెండూ హైలైట్: డైరెక్టర్ శ్రీవాస్ 

Ramabanam Press Meet

  • గోపీచంద్ హీరోగా రూపొందిన 'రామబాణం'
  • శ్రీవాస్ తో గోపీకి ఇది మూడో సినిమా 
  • కథానాయికగా అలరించనున్న డింపుల్ 
  • మే 5వ తేదీన ఈ సినిమా విడుదల

'లక్ష్యం'.. 'లౌక్యం' తరువాత శ్రీవాస్ - గోపీచంద్ కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమానే 'రామ బాణం'. డింపుల్ హయతి కథనాయికగా నటించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. 

ఈ వేదికపై శ్రీవాస్ మాట్లాడుతూ .. "గతంలో నేను .. గోపీచంద్ చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉండటం కోసం మరింతగా కష్టపడవలసి వచ్చింది. ఈ కథను గ్రాండ్ స్కెల్ లో చేస్తేనే బాగుంటుంది. అలా చేసే విశ్వప్రసాద్ గారు దొరకడం మా అదృష్టం. ఈ సినిమాలో గోపీచంద్ ఫ్యాన్స్ కి కావలసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా అనిపిస్తాయి" అని అన్నారు. 

"ఈ సినిమా కోసం వేసిన హోటల్ సెట్ .. ఇంటి సెట్ .. కోల్ కతాకి సంబంధించిన సెట్, సహజత్వానికి చాలా దగ్గరగా కనిపిస్తాయి. కలర్ కాంబినేషన్ ... కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాము. గోపీచంద్ గారు ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు. ఈ సినిమాకి ఇంటర్వెల్ .. క్లైమాక్స్ చాలా  హైలైట్ అవుతాయి. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా, ఈ సమ్మర్ లో మీ అందరినీ అలరిస్తుంది" అని చెప్పుకొచ్చారు. 

Gopichand
Dimple Hayathi
Sriwass
Ramabanam Movie
  • Loading...

More Telugu News