Telangana: తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. ఐఎండీ అలర్ట్

Another Rain alert to Telangana

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు
  • ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన
  • గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలను ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తుతాయని హెచ్చరించింది. బుధవారం (ఈరోజు) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు కారణం వాతావరణంలో నెలకొన్న అనిశ్చితితో పాటు ద్రోణి ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. గురువారం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు.. మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు అందివచ్చిన పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయంగా మారిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Telangana
Rain alert
more five days
  • Loading...

More Telugu News