Nara Lokesh: ​ఇలాంటి మంచి పని ఒక్కటైనా చేశావా జగన్?: లోకేశ్

Lokesh asks Jagan have you ever done a good work like Chandrababu

  • మంత్రాలయం నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • కోసిగిలో బహిరంగ సభ
  • సీఎం జగన్ పైనా, వైసీపీ నేతలపైనా ధ్వజమెత్తిన లోకేశ్
  • స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు

టీడీపీ యువనేత నారా లోకే చేపట్టిన యువగళం పాదయాత్ర 80వ రోజు మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రవేశించింది. గవిగట్టు క్రాస్ వద్ద మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ కు ఇన్చార్జి తిక్కారెడ్డి, టీడీపీ  కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

చంద్రబాబు పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది!

పాదయాత్ర దారిలో పులికనుమ కెనాల్ ను చూసిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోందని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించిందని వెల్లడించారు. 

"తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్ కు నీరు నిలిపివేసినపుడు ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా కోసిగి మండలం పులికనుమ వద్ద రూ. 261 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు. దీని ద్వారా 64 గ్రామాలకు తాగునీరు, 26 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కళ్లలో ఆనందం చూసేలా ఇలాంటి ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ?" అంటూ చురకలంటించారు.

కోసిగి బహిరంగ సభలో లోకేశ్ మాటల తూటాలు....

  • జగన్ రేపో, మాపో జైలుకు వెళ్లడం ఖాయం... అవినీతి కేసుల్లో వెళతాడో, బాబాయిని చంపిన కేసులో వెళతాడో వెంకన్నకే తెలుసు. అందుకే ఆయనను జైలు జగన్ అంటున్నాను
  •  బాబాయిని లేపేసిన కేసులో కుటుంబం మొత్తం ఇరుక్కుపోయింది. ఏపీలో జగన్, అవినాశ్, భారతీ రెడ్డి ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనని జనం బెట్టింగులు కాస్తున్నారు.
  • చంచల్ గూడా జైలు జగన్ రావాలి, జగన్ కావాలి అంటోంది... శాశ్వతంగా జైలుకు పంపించే బాధ్యత ప్రజలపై ఉంది. 
  • నా పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా కుక్కల్ని పంపుతున్నారు... సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర, నా జోలికొస్తే తోలు వలిచి ఇంటికి పంపిస్తా.
  • జగన్ ఒక చెత్త ముఖ్యమంత్రి, సింహాద్రి కొండపై కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని అసమర్థుడు. భక్తులను పోలీసులతో కొట్టించాడు.
  •  రబీలో ఎంత ధాన్యం కొంటారో ఒక పాలసీ అంటూ లేని చెత్త ప్రభుత్వం. 
  • వైసీపీ ఒక రసికరాజుల పార్టీ. ఒకరు ప్యాంటు తీస్తారు, అవంతి షర్టు తీస్తారు, అంబటి అన్నీ తీస్తారు. బట్టలు లేకుండా తిరగడం వారికి ఫ్యాషన్. వారందరరినీ ఆదర్శంగా తీసుకుని మంత్రి సురేశ్ వచ్చారు. 
  • దళిత డ్రైవర్ ను చంపినపుడు ఎందుకు షర్ట్ విప్పలేదు? విదేశీ విద్య పేరు మార్చినపుడు ఎందుకు షర్ట్ విప్పలేదు? దళితులకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసినపుడు ఎందుకు షర్ట్ విప్పలేదు? 
  • నేను దళితులను అనని మాటలను అన్నట్లు ఫేక్ వీడియోలో సృష్టించి వదిలారు. దమ్మూ, ధైర్యం ఉంటే మొత్తం వీడియో బయటపెట్టండి... నిరూపించలేకపోతే సాక్షి మూసేస్తారా? 
  • మంత్రాలయం మాస్ జాతర చూస్తే జగన్ కి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. 
  • మంత్రాలయం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. శ్రీశ్రీ రాఘవేంద్రస్వామి నడిచిన నేల ఇది. కౌతాళం ఖాదర్ లింగ దర్గా, ఉరుకుంద ఈరన్న క్షేత్రం ఉన్న పుణ్య భూమి మంత్రాలయం. ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగు కాదు... విషనాగు!

ఈ సందర్భంగా లోకేశ్ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపైనా ధ్వజమెత్తారు. "మంత్రాలయం ఎమ్మెల్యే పేరు బాలనాగిరెడ్డి. మంత్రాలయం రూపురేఖలు మారుస్తాడు అని మీరు మూడు సార్లు వరుసగా గెలిపించారు. మంత్రాలయం లో మార్పు వచ్చిందా? ఇక్కడ అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అందుకే మీ ఎమ్మెల్యే పేరు మార్చాను ఆయన బాలనాగు కాదు... విషనాగు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ పేరుతో మంత్రాలయాన్ని దోచేస్తుంది విషనాగు మాఫియా. 

పెదకడుబూరులో సెంటు స్థలాల కొనుగోలులో భారీ స్కామ్ చేసాడు విషనాగు. ఐదు ఎకరాల భూమి ఎకరా రూ. 5 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.40 లక్షలకు అమ్మేసాడు. ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడో తెలుసా? వాగులు, వంకలు. ఈ విషనాగు అక్కడ ఒక్క రోజైనా ఉండగలడా? చిన్న తుంబళం గ్రామం రాయలచెరువులో తరతరాలుగా చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను తరిమేసి చెరువు ఆక్రమించుకున్నాడు ఈ విషనాగు. 

ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు మీ విష నాగు. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో టెంకాయలు, తలనీలాలు కూడా టెండర్ లేకుండా కొట్టేసారు ఈ విషనాగు అనుచరులు. 

మంత్రాలయాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ!

మంత్రాలయాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ అని లోకేశ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేసింది టీడీపీ అని వెల్లడించారు. మంత్రాలయం లో రూ. 6 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసింది టీడీపీ. రూ.13 కోట్లతో మంత్రాలయం పట్టణానికి, చిలకలదోన, సుగూరు, కల్లుదేవకుంట గ్రామాలకు రూ.13 కోట్లతో తాగునీరు అందించాం. గురు రాఘవేంద్ర స్వామి, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాలను అభివృద్ధి చేసి పన్ను మినహాయింపు ఇచ్చాం. 

గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించటం జరిగింది. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని టీడీపీ ప్రభుత్వంలో రూ.1,986 కోట్లు మంజూరు చేసి ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తాం" అని లోకేశ్ తెలిపారు.

====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 1030.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.6 కి.మీ.*

*81వ రోజు (26-4-2023) యువగళం వివరాలు:*

*మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

7.00 – కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – డి.బెళగళ్ పంచాయితీ దొడ్డిలో స్థానికులతో సమావేశం.

9.25 – డి.బెళగల్ లో విఆర్ఓలతో సమావేశం.

9.50 – పల్లెపాడు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

11.00 – గురురాఘవేంద్ర ప్రాజెక్టు క్రాస్ వద్ద మాటామంతీ.

మధ్యాహ్నం 

12.05– లచ్చుమర్రి క్రాస్ సమీపంలో ముఖాముఖి.

1.05 – లచ్చుమర్రి క్రాస్ సమీపంలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – లచ్చుమర్రి క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.00 – లచ్చుమర్రిలో ఈ-సేవ ఉద్యోగులతో సమావేశం.

6.40 – మాధవరం శివారు విడిది కేంద్రంలో బస.

*******

  • Loading...

More Telugu News