Viral Video: అనుష్కకు దగ్గరగా వచ్చిన అభిమాని.. విరాట్ గుస్సా

Virat gets angry after fans mob him and anuskha for selfie

  • ఇటీవల బెంగళూరులోని ఓ పాప్యులర్ రెస్టారెంట్‌లో విరాట్ అనుష్క లంచ్
  • బయటకు వచ్చే క్రమంలో చుట్టుముట్టిన అభిమానులు
  • సెల్ఫీ కోసం అనుష్క వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి, ఆగ్రహించిన విరాట్ 
  • వైరల్ అవుతున్న వీడియో 

అనుష్క శర్మతో సెల్ఫీ కోసం దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తిపై ఆమె భర్త విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వద్దు..వద్దు అంటూ కళ్లతోనే కోపంగా హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గతవారం అనుష్క, కోహ్లీ దంపతులు బెంగళూరులోని సెంట్రల్ టిఫిన్ రూంకు వెళ్లారు. ఇది తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అనుష్క, విరాట్ బయటకు వచ్చే క్రమంలో వారిని చుట్టుముట్టారు. వారు కారులోకి ఎక్కేందుకు కూడా మార్గం లేకపోయింది. 

భద్రతా సిబ్బంది అభిమానులను నిలువరించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అనుష్కతో సెల్ఫీ కోసం ఆమె వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే కోహ్లీ అతడిని వద్దంటూ నిలువరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అనుష్క, విరాట్ దంపతులకు ప్రైవెసీ లేకుండా చేస్తున్నారంటూ ఫ్యాన్స్‌ను విమర్శించారు. ఈ మారు అభిమానులు విరాట్‌కు బాగానే కోపం తెప్పించారంటూ మరికొందరు కామెంట్ చేశారు.

More Telugu News