Sampath Raj: ఓటీటీలో ఈ వారం వెబ్ సిరీస్ లు ఇవే!

OTT Movies Releasing in this Week

  • ఈ నెల 26వ తేదీన ఆహాలో 'జల్లికట్టు' వెబ్ సిరీస్ 
  • 27వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సేవ్ ది టైగర్స్' 
  • 28వ తేదీన 'జీ 5'లో 'వ్యవస్థ'
  • సంపత్ రాజ్ ప్రధానమైన పాత్రగా నడిచే కథ

ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు పెరిగిన ప్రాధాన్యత గురించి .. ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అందువల్లనే ఓటీటీ సంస్థలన్నీ కొత్త కంటెంట్ తో వెబ్ సిరీస్ లను అందించడానికి పోటీ పడుతున్నాయి. అలా ఈ వారం 'జీ5' నుంచి 'వ్యవస్థ' వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

'వ్యవస్థ'లోని అవినీతిని టార్గెట్ చేసే వెబ్ సిరీస్ ఇది. సంపత్ రాజ్ .. కార్తీక్ రత్నం ... హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూడు పాత్రలనే ప్రధానంగా చేసుకుని ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. 

ఇక 'ఆహా'లో ఈ నెల 26వ తేదీ నుంచి 'జల్లికట్టు' స్ట్రీమింగ్ కానుంది. తమిళనాడులోని 'జల్లికట్టు' నేపథ్యంలో సాగే కథ ఇది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి, సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడు. ఇక అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో 'కోర్ట్ లేడీ' .. 'నోవో ల్యాండ్' వెబ్ సిరీస్ లు, 27వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సేవ్ ది టైగర్స్' తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. 

Sampath Raj
Karthik Rathnam
Hebbah Patel
Vyavastha

More Telugu News