Chiranjeevi: కోడలి సీమంతం వేడుకలో మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో!

Megastar Chiranjeevi and family members attends to Upasana baby shower

  • గర్భవతి అయిన ఉపాసన
  • త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న మెగా కోడలు
  • సీమంతం వేడుకలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన సీమంతం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన అర్ధాంగి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

ఉపాసన సీమంతం తొలుత దుబాయ్ లో జరగ్గా... ఆ తర్వాత హైదరాబాద్ లో రెండు కార్యక్రమాలు నిర్వహించారు. అందులో ఒకదాంట్లో చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ఉపాసన గర్భవతి అని కొన్ని నెలల కిందటే అందరికీ తెలిసిందే. తాము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నామని రామ్ చరణ్, ఉపాసన సోషల్ మీడియాలో ప్రకటించారు. రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇన్నాళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు.

More Telugu News