: మత్తు మందు ఇచ్చారు.. ఆపరేషన్ ఆపేశారు!


వైద్య అధికారుల అలసత్వంతో ఆదిలాబాద్ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునే మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లాలోని లక్సెట్టిపేటలో ఈ రోజు కు.ని శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలకు తొలుత మత్తు మందు ఇచ్చారు. అయితే, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్లు ఆపివేయడంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

  • Loading...

More Telugu News