Virat Kohli: పంజాబీ పాటకు స్టెప్పులు వేసిన కోహ్లీ, అనుష్క.. వీడియో వైరల్

virat kohli and anushka sharma dancing on a punjabi song

  • జిమ్ లో హుషారుగా డ్యాన్స్ చేసిన దంపతులు
  • కాలు పట్టేయడంతో మధ్యలోనే ఆపేసిన విరాట్
  • ఐపీఎల్ లో సత్తా చాటుతున్న కోహ్లీ

ఇండియా టాప్ సెలబ్రిటీ దంపతుల్లో ఒకరైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.  తమ ప్రొఫెషనల్, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. చాలా సరదాగా ఉండే ఈ ఇద్దరూ తాజాగా ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జిమ్ లో పంజాబీ పాటకు ఒక కాలును చేత్తో పట్టుకొని మరో కాలుపై స్టెప్పులు వేశారు. హీరోయన్ గా ఇలాంటి ఎన్నో పాటల్లో నర్తించిన అనుష్క తన మార్కు హావభావాలతో హుషారుగా డ్యాన్స్ చేసింది. 

కానీ, కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో  కోహ్లీ పక్కకు వెళ్లిపోయాడు. దాంతో, అనుష్క బిగ్గరగా నవ్వింది. వీడియో ఆఫ్ ద డే అంటూ కోహ్లీ, అనుష్క డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫు ఐపీఎల్ 16వ సీజన్ లో బిజీగా ఉన్నాడు. అనుష్క పలు మ్యాచ్ లకు హాజరై స్టేడియంలో సందడి చేస్తోంది.

More Telugu News