Sriwass: ఎన్టీఆర్ తో ఆ సినిమా చేసుంటే వేరేగా ఉండేది: డైరెక్టర్ శ్రీవాస్

Sriwass Interview

  • గోపీచంద్ కి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్
  • మూడో సినిమాగా వస్తున్న 'రామబాణం'
  • ఎన్టీఆర్ తో ప్రాజెక్టును గురించిన ప్రస్తావన 
  • పవన్ తో చేయడం కుదరలేదని వ్యాఖ్య  

టాలీవుడ్ లో అటు ఎమోషన్ ను .. ఇటు యాక్షన్ ను కలిపి భారీ విజయాలను అందుకున్న వారిలో శ్రీవాస్ ఒకరుగా కనిపిస్తారు. గోపీచంద్ హీరోగా ఇంతకుముందు 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు చేసిన ఆయన, మూడో సినిమాగా 'రామబాణం' చేశారు. మే 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా గ్రేట్ ఆంధ్రకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవాస్ మాట్లాడుతూ .. 'లక్ష్యం' సినిమా తరువాత నేను దిల్ రాజుగారికి ఒక కథ చెప్పాను. ఆ కథ ఆయనకి బాగా నచ్చేసింది. ఎవరితో చేస్తే బాగుంటుందని ఆయన అడిగితే, ఎన్టీఆర్ అయితే కరెక్టుగా సరిపోతాడని అన్నాను. దాంతో ఆయన నన్ను ఎన్టీఆర్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ కథ విని ఎన్టీఆర్ కూడా చాలా బాగుందని అన్నారు. 

ఆ కథ పై నాలుగు నెలల పాటు వర్క్ చేసిన తరువాత, ఎందుకనో ఎన్టీఆర్ గారు అంతగా ఆసక్తిని చూపించలేదు. ఆ రోజున ఎన్టీఆర్ గారితో ఆ కథను గనుక నేను చేసుంటే 'శ్రీమంతుడు' .. 'శతమానం భవతి' .. ' మహర్షి' వంటి కథలు రాకపోయేవి. ఆ కథ పవన్ కి కూడా బాగా నచ్చిందిగానీ, అప్పుడున్న పరిస్థితుల వలన కుదరలేదు" అంటూ చెప్పుకొచ్చారు. 

Sriwass
Ntr
Dil Raju
  • Loading...

More Telugu News