Akhil: అఖిల్ కసితో చేసిన సినిమా ఇది: 'ఏజెంట్' ఈవెంటులో సురేందర్ రెడ్డి

- 'ఏజెంట్' గా కనిపించనున్న అఖిల్
- ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల
- వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
- అఖిల్ లో వైల్డ్ మాసీ హీరోను చూస్తారన్న సాక్షి వైద్య
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఏజెంట్' సినిమా, ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, అఖిల్ జోడీగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. నాగార్జున ముఖ్య అతిథిగా వరంగల్ లోని 'రంగీలా మైదాన్'లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును, నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల సమక్షంలో దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ .. "నేను పుట్టింది కరీంనగర్ లో .. పెరిగిందంతా వరంగల్ లో. ఇక్కడి నుంచే నా సినిమా అడుగులు హైదరాబాద్ దిశగా పడ్డాయి. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ చేశాడనే అంతా చూస్తున్నారు. కానీ ఆయనలో నేను ఓ కసి చూశాను. ఆయనకి హిట్ ఇస్తానని ప్రామిస్ చేశాను .. నా ప్రామిస్ ను నిలబెట్టుకుంటాననే అనుకుంటున్నాను" అని చెప్పారు.
