Urvashi Rautela: ఊర్వశి రౌతేలాను అఖిల్ వేధించాడన్న ఉమైర్ సంధూ... పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి

Urvashi Rautela sues Umair Sandhu

  • తానో సెన్సార్ బోర్డు సభ్యుడ్నని చెప్పుకునే ఉమైర్ సంధూ
  • భారతీయ సినిమాలపై రివ్యూలు
  • ఉమైర్ సంధూ ట్వీట్ లో వాస్తవం లేదన్న ఊర్వశి
  • అఖిల్ తనను వేధించలేదని స్పష్టీకరణ

తనను తాను విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడ్నని చెప్పుకుంటూ, బాలీవుడ్, టాలీవుడ్ తదితర సినిమాలపై రివ్యూలు ఇస్తుండే ఉమైర్ సంధూపై నటి ఊర్వశి రౌతేలా మండిపడుతోంది. 

ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయంలో ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఊర్వశి అభిప్రాయం ప్రకారం అఖిల్ లాంటి హీరోతో పనిచేయడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్వీట్ చేయగా, అది కాస్తా వైరల్ అయింది. 

దాంతో, ఊర్వశి రౌతేలా తీవ్రంగా స్పందించింది. ఉమైర్ ట్వీట్ లో వాస్తవం లేదని, అఖిల్ తనను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని స్పష్టం చేసింది. తన ప్రతినిధులు ఇప్పటికే ఉమైర్ సంధూపై పరువునష్టం దావా వేశారని వెల్లడించింది. 

ఇటువంటి పనికిమాలిన ట్వీట్స్ చేస్తున్న వారి వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేసింది. ఏజెంట్ చిత్రంలో ఊర్వశి ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.

Urvashi Rautela
Umair Sandhu
Akhil
Agent
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News