Amit Shah: శంషాబాద్ నుండి చేవెళ్ల బహిరంగ సభకు బయలుదేరిన అమిత్ షా

Amit Shah reaches Hyderabad

  • విమానాశ్రయంలో స్వాగతం పలికిన బండి, కిషన్, లక్ష్మణ్
  • విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో విజయ సంకల్ప సభకు షా
  • గంటపాటు సభలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్ నుండి రోడ్డు మార్గంలో చేవెళ్ల బహిరంగ సభకు బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. 

శంషాబాద్ చేరుకున్న అమిత్ షాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలికారు. చేవెళ్ల సభలో దాదాపు గంటసేపు అమిత్ షా ఉంటారు. రాత్రి ఏడు గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతారు. చేవెళ్లలోని కేవీఆర్ మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభను నిర్వహిస్తోంది.

ఈ సభ కోసం మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేసి, విజయవంతం చేయాలని బీజేపీ పెద్దలు నిశ్చయించారు. సభకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఉండేందుకు తాగేందుకు మంచి నీళ్ల దగ్గర నుంచి పార్కింగ్ వరకు అన్ని ఏర్పాట్లు చేశారు. సభా స్థలి వద్ద వాహనాల పార్కింగ్ కోసం నాలుగు చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

కాగా, అమిత్ షా రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు.

Amit Shah
BJP
Telangana
  • Loading...

More Telugu News