Komatireddy Raj Gopal Reddy: రేవంత్ కు బ్లాక్ మెయిలర్ అనే పేరు ఉంది... వేలకోట్లు దోచుకున్నాడు: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy targets Revanth Reddy

  • ట్విట్టర్ వేదికగా రేవంత్ ను టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి 
  • రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ తనపైనా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య
  • రుజువు చేయకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

రేవంత్ రెడ్డి పైన తెలంగాణ బీజేపీ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పబ్లిక్ లో రేవంత్ రెడ్డికి ఒక బ్లాక్ మెయిలర్ అనే పేరు ఉందని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దోచుకొని, ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి అమ్మవారి వద్ద ప్రమాణాలు అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. 

రేవంత్ రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన పైన కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నాడని, అవి రుజువు చేయకుంటే తాను పరువు నష్టం దావా వేస్తానని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

అంతకుముందు బండి సంజయ్, ఈటల రాజేందర్ తదిరులు కూడా రేవంత్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే తన అధ్యక్ష పదవి పోతుందని, ముఖ్యమంత్రి కాలేకపోతున్నానని రేవంత్ ఏడ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నుండి రూ.25 కోట్లు రేవంత్ తీసుకున్నట్లుగా తాను చెప్పలేదని, కాంగ్రెస్ కు ముట్టాయని చెప్పానని ఈటల గుర్తు చేశారు. వీరుడు కన్నీరు పెట్టరని ఎద్దేవా చేశారు.

ఈటలపై మండిపడ్డ సీతక్క

ఈటల రాజేందర్ పైన కాంగ్రెస ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు. అధికార బీఆర్ఎస్ పార్టీ పైన పోరాడుతున్న కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భాగ్యలక్ష్మి గుడికి రావడానికి ఈటల ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. కేసీఆర్ పైన రేవంత్ తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. పాత గురువు కేసీఆర్ గెలుపు కోసం ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

Komatireddy Raj Gopal Reddy
Revanth Reddy
  • Loading...

More Telugu News