Timeless Love: నాగచైతన్య 'కస్టడీ' నుంచి 'టైమ్ లెస్ లవ్' లిరికల్ సాంగ్ విడుదల

Timeless Love lyrical song from Nagachaitanya Custody out now

  • నాగచైతన్య, కృతిశెట్టి జంటగా కస్టడీ
  • వెంకట్ ప్రభు దర్శకత్వంలో, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం
  • మే 12న రిలీజ్
  • సంగీతం అందించిన ఇళయరాజా

అక్కినేని నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం 'కస్టడీ'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి 'కస్టడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా, ఈ చిత్రం నుంచి 'టైమ్ లెస్ లవ్' గీతాన్ని చిత్ర బృందం నేడు విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో యూట్యూబ్ లో విడుదల కొద్దిసమయంలోనూ వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది. 

మ్యాస్ట్రో ఇళయరాజా బాణీలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటను ఆలపించారు. కస్టడీ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరేన్, వెన్నెల కిశోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటించారు.

More Telugu News