sarath babu: నటుడు శరత్ బాబు ఆరోగ్యం అత్యంత విషమం!

senior actor sarath babu health update

  • శరత్ బాబు శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్ వ్యాపించిందన్న డాక్టర్లు
  • వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వెల్లడి
  • ఈ రోజు సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం

సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్ వ్యాపించిందని, ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.

కొన్నాళ్ల కిందట అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. చెన్నైలో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే మరోసారి అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టంతో ఈ నెల 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది.

శరత్ బాబు శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. శరత్ బాబు ఆరోగ్యంపై ఈ రోజు సాయంత్రం బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

sarath babu
health update
critical condition
AIG Hospital
  • Loading...

More Telugu News