Pavan Kalyan: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'OG'

OG Movie Update

  • తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్
  • సెట్స్ పైనే ఉండిపోయిన 'వీరమల్లు' 
  • సుజీత్ దర్శకత్వంలో మొదలైన 'OG' షూటింగ్ 
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్   

పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమా అలా సెట్స్ పైనే ఉంది. ఎందుకు ఆలస్యం అవుతుందన్నది ఎవరికీ తెలియదు. ఆ సినిమా అలా ఉండగానే, పవన్ ఇటీవల సముద్రఖని దర్శకత్వంలో తమిళ సినిమా రీమేక్ ను కూడా పూర్తిచేశాడు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను సాయితేజ్ చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత 'వీరమల్లు' సెట్స్ పైకి వెళతాడని అభిమానులు అనుకున్నారు. కానీ పవన్ డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ముంబైలో మొదలైంది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా షూటింగుకి హాజరైంది. 'OG' టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి. 

ఈ సినిమా కథ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. ఖరీదైన కార్లు .. ఛేజింగులు .. భారీ యాక్షన్ సీన్స్ మధ్య ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఇంతకుముందు పవన్ కల్యాణ్ ను ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో సుజీత్ చూపించనున్నాడని అంటున్నారు. ఈ స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ పై అభిమానుల అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.

More Telugu News