DK Shivakumar: డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు

EC officials checked DK Shivakumar helicopter

  • ధర్మస్థలకు వెళ్లిన డీకే శివకుమార్
  • హెలిప్యాడ్ లో చాపర్ ల్యాండ్ అయిన వెంటనే తనిఖీలు
  • వారి డ్యూటీ వారు చేశారన్న డీకే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో, కీలక నేతలంతా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. తాజాగా ఈరోజు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. దక్షిణ కన్నడలోని ధర్మస్థలకు ఆయన వెళ్లారు. హెలికాప్టర్ హెలిప్యాడ్ కు చేరుకోగానే ఈసీ అధికారులు సోదా చేశారు. 

మరోవైపు ఈసీ సోదాలపై శివకుమార్ స్పందిస్తూ... సోదాలు చేయడంలో తప్పు లేదని చెప్పారు. ఈసీ అధికారులు వారి విధులను నిర్వర్తించారని అన్నారు. మంజునాథ స్వామిపై తనకు అపారమైన నమ్మకం ఉందని... అందుకే తన కుటుంబంతో కలిసి ఇక్కడకు వచ్చానని చెప్పారు. తనను, రాష్ట్రాన్ని స్వామివారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.

More Telugu News