Gujarat Titans: ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ ల హంగామా... టాస్ గెలిచిన టైటాన్స్

Gujarat Titans won the toss against LSG

  • వీకెండ్ నేపథ్యంలో డబుల్ హెడర్
  • తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
  • రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ

వీకెండ్ కావడంతో ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) జోష్ వచ్చేసింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

కాగా, ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. గుజరాత్ టైటాన్స్ జట్టులో అల్జారీ జోసెఫ్ చోటు కోల్పోగా, నూర్ మహ్మద్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. అటు, లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టులో అమిత్ మిశ్రాకు స్థానం కల్పించారు. యుధ్ వీర్ సింగ్ కు చోటు దక్కలేదు. పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 

ఇక, ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

Gujarat Titans
LSG
Toss
Double Header
IPL
  • Loading...

More Telugu News