Jupudi Prabhakar: చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న సైతాన్: జూపూడి

Chandrababu is anti Dalit says Jupudi

  • దళితులను చంద్రబాబు ఊచకోత కోయించారన్న జూపూడి
  • రాష్ట్రాన్ని మరో కారంచేడు చేయాలని చూస్తున్నారని ఆరోపణ
  • బాబును, లోకేశ్ ను దళితజాతి క్షమించదని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. దళితులను చంద్రబాబు ఊచకోత కోయించారని ఆరోపించారు. దళిత మంత్రి ఆదిమూలపు సురేశ్ పై దాడులు చేయించారని విమర్శించారు. ప్రశ్నించిన తమపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. అమరావతిలో దళితులు ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసులు వేయించారంటే ఆయన స్వభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రాన్ని మరో కారంచేడు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తాము అడ్డుకుంటామని చెప్పారు. చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న సైతాన్ అని విమర్శించారు. దళితులు ఏం పీకారని లోకేశ్ అన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును, లోకేశ్ ను దళిత జాతి క్షమించదని అన్నారు. 

Jupudi Prabhakar
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News