Komatireddy Venkat Reddy: నల్గొండ నుంచే పోటీ చేస్తా: కోమటి రెడ్డి వెంకటరెడ్డి

I will contest from Nalgonda says Komatireddy
  • స్వార్థం లేకుండా పాదయాత్ర చేసేవాడే నాయకుడన్న కోమటిరెడ్డి
  • జూన్ మొదటి వారంలో భట్టి పాదయాత్ర నల్గొండకు చేరుకుంటుందని వెల్లడి
  • ఆరోజు ఏర్పాటు చేసే సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారన్న కోమటిరెడ్డి
నాయకుడంటే స్వార్థం లేకుండా పాదయాత్ర చేసేవాడని... ఆయనే రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. జూన్ మొదటి వారంలో భట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండకు చేరుకుంటుందని, ఆ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేస్తామని, ఆ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ నెల 28న నల్గొండలోని ఎంజీయూలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ దీక్ష నిర్వహించబోతున్న సంగతి తనకు తెలియదని... ఈ ఉదయం ఆ దీక్ష గురించి తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తాను పోటీ చేస్తే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Komatireddy Venkat Reddy
Priyanka Gandhi
Congress

More Telugu News