Saitej: 'విరూపాక్ష' తొలిరోజు వసూళ్లు ఇవే!

Virupaksha Movie Update

  • యాక్షన్ తో కూడిన హారర్ థ్రిల్లర్ గా 'విరూపాక్ష'
  • తొలి ఆటతోనే దక్కిన హిట్ టాక్
  • ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు 12 కోట్ల గ్రాస్
  • చాలా గ్యాప్ తరువాత హిట్ కొట్టిన సాయితేజ్  

'విరూపాక్ష' .. అందరూ ఇప్పుడు ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. క్షుద్రశక్తుల అధీనంలో ఉన్న ఒక గ్రామాన్ని, ధైర్యవంతుడైన హీరో ఎలా బయటపడేశాడనేది కథ.

సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో  తొలిరోజున ఈ సినిమా 8.60 కోట్ల గ్రాస్ ను .. 4.79 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 12 కోట్ల గ్రాస్ ను సాధించింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

కార్తీక్ వర్మ కథ చెప్పడంలో ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. లాజిక్ మిస్ కాకుండా .. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతూ వెళ్లాడు. స్క్రీన్ ప్లేతో కథను నడిపించిన తీరు, దృశ్యపరంగా తీసుకొచ్చిన ఎఫెక్ట్ .. కాకుల గుంపుకి సంబంధించిన గ్రాఫిక్స్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నిలబెట్టేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News