Akhil Akkineni: రేపే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..!

Agent pre release event at warangal on 23rd april

  • అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రం
  • ఈ నెల 28న విడుదల కానున్న కొత్త సినిమా
  • రేపు వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా చేసిన భారీ యాక్షన్ సినిమా ‘ఏజెంట్’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ మొదటిసారి నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ ఈ చిత్రంలో కండలు తిరిగి దేహంతో రెబల్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రమోషన్స్ జోరు పెంచారు. తెలుగు  రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. వేదికగా వరంగల్ ను ఎంచుకుంది. వరంగల్ లోని రంగలీల మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొనే అవకాశం ఉంది.

More Telugu News