Ivana: 'లవ్ టుడే' బ్యూటీ హీరోయిన్ గా 'సెల్ఫిష్'

Ivana in Selfish movie

  • ఆశిష్ హీరోగా రూపొందుతున్న 'సెల్ఫిష్'
  • హైదరాబాద్ నేపథ్యంలో నడిచే కథ 
  • దర్శకత్వం వహిస్తున్న విశాల్ శివ
  • సంగీతాన్ని అందిస్తున్న మిక్కీ జె మేయర్

క్రితం ఏడాది తెలుగులో హిట్ కొట్టిన చిత్రాలలో 'లవ్ టుడే' ఒకటి. కోలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా, అక్కడ హిట్ కొట్టడమే కాకుండా, ఇక్కడి యూత్ కి కూడా ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన 'ఇవాన'కి ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడిపోయారు. 

విశాలమైన కళ్లతో ఇవాన చేసిన విన్యాసాలకు కుర్రాళ్లు మనసులు పారేసుకున్నారు. ఆ తరువాత ఆమె వరుస తమిళ సినిమాలతోనే బిజీ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఆమె ఒక తెలుగు సినిమా చేస్తోంది .. ఆ సినిమా పేరే 'సెల్ఫిష్'. 

ఈ సినిమాలో ఆమె ఆశిష్ జోడీగా 'చైత్ర' పాత్రలో అలరించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటికి క్రితం విడుదల చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను, దిల్ రాజు - సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో ఇవాన టాలీవుడ్ లోను బిజీ అవుతుందేమో చూడాలి.

More Telugu News