Sudheer Babu: ఆసక్తిని రేకెత్తిస్తున్న 'మామా మశ్చీంద్ర' .. టీజర్ రిలీజ్!

Maama Mascheendra Teaser Released

  • 'మామా మశ్చీంద్ర'గా సుధీర్ బాబు 
  • మూడు విభిన్నమైన పాత్రల విన్యాసం 
  • హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన సినిమా 
  • కథానాయికగా మృణాళిని రవి  

జయాపజయాల సంగతి అటుంచితే, మొదటి నుంచి కూడా సుధీర్ బాబు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన ఎంచుకున్న మరో వైవిధ్యభరితమైన చిత్రంగా 'మామా మశ్చీంద్ర' కనిపిస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ సినిమా ముస్తాబవుతోంది.

"కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ చేశాడు. లావుగా .. సిక్స్ ప్యాక్ తో .. మధ్య వయసులో ఉన్న పాత్రలలో ఆయన కనిపిస్తున్నాడు. ఈ మూడు పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. 

 సునీల్ నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ నిర్మించిన ఈ సినిమాకి, హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా మృణాళిని రవి అలరించనుంది. కొంతకాలంగా హిట్ కోసం సుధీర్ బాబు వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.

More Telugu News