Salman Khan: వసూళ్లలో తొలి రోజు నిరాశ పరిచిన సల్మాన్ కొత్త సినిమా

Kisi Ka Bhai Kisi Ki Jaan box office collection Day 1

  • రంజాన్ కానుకగా విడుదలైన కిసీ కా భాయ్ కిసి కీ జాన్
  • కీలక పాత్ర పోషించిన విక్టరీ వెంకటేశ్  
  • ప్రపంచ వ్యాప్తంగా 5700 స్ర్కీన్లలో ప్రదర్శన
  • నేటి వసూళ్లు రూ. 15 కోట్ల వరకు వుండచ్చని అంచనా 

చాలా ఏళ్ల విరామం తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రంజాన్ సందర్భంగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, తన సొంత బ్యానర్‌లో నిర్మించిన ‘కిసీ కా భాయ్ కిసి కీ జాన్’ రంజాన్ కానుకగా శుక్రవారం విడుదలైంది. తమిళంలో విజయవంతమైన వీరమ్ (తెలుగులో కాటమరాయుడు) సినిమాకు ఇది రీమేక్‌. పూజా హెగ్గే హీరోయిన్ గా నటించగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. తెలుగు నేటివిటీ బ్యాక్ డ్రాప్‌గా ఈ చిత్రాన్ని దాదాపు  100 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు తెలుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సల్మాన్ గత సినిమాలకంటే అన్ని భాషల్లో అతి తక్కువ ఆక్యుపెన్సీ లభించింది. తొలి రోజు నెట్ కలెక్షన్స్ రూ. 15 కోట్ల వరకు వుండచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ చిత్రాలు తొలి రోజు కనీసం 20 కోట్లపైనే రాబట్టాయి.  

More Telugu News