Andhra Pradesh: ఏపీలో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Rains with thundershowers in AP today and tomorrow

  • తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి
  • నిన్న రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు
  • ఈ నెల 25 వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ
  • ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పులు

వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 25 వరకు కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. ఫలితంగా సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నిన్న రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.

మరోవైపు, రాష్ట్రంలోని అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని పది మండలాల్లో నిన్న వడగాల్పులు వీచాయి. పలు చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News