Gopichand: ఈ సారి హ్యాట్రిక్ హిట్ తప్పదు: హీరో గోపీచంద్

Ramabanam Trailer Launch Event

  • రాజమండ్రిలో జరిగిన 'రామబాణం' ట్రైలర్ లాంచ్ 
  • శ్రీవాస్ తో మూడో సినిమా చేశానన్న గోపీచంద్ 
  • మిక్కీ జె.మేయర్ సంగీతం గొప్పగా ఉంటుందని వెల్లడి 
  • గోపీచంద్ తో చేయడం అదృష్టమన్న డింపుల్ హయతి 

గోపీచంద్ హీరోగా రూపొందిన 'రామబాణం' రాజమండ్రిలో ట్రైలర్ లాంచ్ ఈవెంటును జరుపుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ఈ వేడుక సందడిగా జరిగింది. ఈ వేదికపై గోపీచంద్ మాట్లాడుతూ .. "ఇంతకుముందు నేను చేసిన 'సీటీమార్' కూడా ఇక్కడే ఫంక్షన్ జరుపుకుంది. ఈ సినిమా ఫంక్షన్ కూడా ఇక్కడ జరుగుతుండటం ఆనందంగా ఉంది" అని అన్నారు. 

"శ్రీవాస్ తో ఇది నాకు మూడో సినిమా. లక్ష్యం .. లౌక్యం మాదిరిగానే ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సారి హ్యాట్రిక్ హిట్ తప్పదు.  సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఇది తమ ఇంట్లో జరుగుతున్న కథగానే భావిస్తారు. అంతగా అందరూ ఓన్ చేసుకుంటారు. అలీ కాంబినేషన్లోని నా సీన్స్ అన్నీ కూడా మీ అందరికీ కనెక్ట్ అవుతాయి. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు" అంటూ చెప్పుకొచ్చారు. ఇక డింపుల్ హయతి మాట్లాడుతూ .. "మీ అందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ ఈ  స్థాయి రెస్పాన్స్ ఉంటుందని నేను ఎంతమాత్రం ఊహించలేదు. ఈ సినిమాలో నా పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. మీ అందరికి వెంటనే కనెక్ట్ అవుతుంది. గోపీచంద్ గారు జెంటిల్ మేన్ .. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News