Sri Vishnu: 'సామజవరగమన' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

Samajavaragamana lyrical song released

  • శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'సామజవరగమన'
  • రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సినిమా 
  • సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్ 
  • మే 18వ తేదీన సినిమా విడుదల

శ్రీవిష్ణు హీరోగా 'సామజవరగమన' సినిమా రూపొందింది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా నిర్మితమైంది. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు జోడీగా రెబా మోనికా జాన్ నటించిన ఈ సినిమాను, మే 18వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఏం బోర్ కొట్టిందో' అంటూ ఈ పాట మొదలవుతోంది. హీరో మందుకొట్టేసి తన ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ పాడుకునే పాట ఇది. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు.

ఈ సినిమాలో వెన్నెల కిశోర్ .. నరేశ్ .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'రాజ రాజ చోర' సినిమా తరువాత శ్రీవిష్ణుకి ఇంతవరకూ హిట్ పడలేదు. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.

More Telugu News