Raghu Rama Krishna Raju: సజ్జల చెప్పిందే నిజమైతే జగన్ బయట తిరిగేవారా?: రఘురామకృష్ణ రాజు

Raghu Raju fires on J

  • వైఎస్ సునీత సుప్రీంకోర్టుకు వెళ్లడంపై రఘురాజు ప్రశంస
  • కంటే కూతురునే కనాలన్న రఘురాజు
  • చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రఘురాజు  

వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివేకా కూతురు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. కంటే కూతురునే కనాలి అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై ఇదేమి తీర్పు అని ప్రజలు అనుకుంటూ ఉండొచ్చని... కానీ, నాయస్థానాన్ని నమ్మాలని చెప్పారు. సునీత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని అవినాశ్ రెడ్డి ఊహించకపోయి ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సాక్షి మీడియాలో వచ్చేవన్నీ నీచమైన కట్టు కథలని రఘురాజు మండిపడ్డారు. చంద్రబాబు, సీబీఐ, కుమ్మక్కయ్యారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు అంటున్నారని... అదే నిజమైతే జగన్ బయట తిరిగేవారా అని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లకుండా ఉండేవారా అని అడిగారు. ఇదే సమయంలో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Raghu Rama Krishna Raju
Jagan
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News