Trinath: ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా 'టూ సోల్స్'

Two Siuls movie update

  • ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా 'టూ సోల్స్'
  • కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా 
  • దర్శకుడిగా శ్రావణ్ పరిచయం
  • ఈ నెల 21వ తేదీన సినిమా రిలీజ్  

తెలుగు తెరపై ప్రేమకథలు రాజ్యం చేస్తూనే వస్తున్నాయి. ప్రేమకథలకు ఫీల్ ప్రాణంలాంటిది. అలాంటి ఫీల్ ఉన్న కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టకడుతూనే ఉన్నారు. ప్రేమకథల్లో యూత్ కి అవసరమైన అంశాలు సహజంగా .. సజీవంగా ఉంటే, కొత్తవారి నుంచి వచ్చిన సినిమాలు కూడా కొత్త రికార్డులను సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. 

అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న మరో ప్రేమకథా చిత్రమే 'టూ సోల్స్'. హీరోగా త్రినాథ్ వర్మ ..  హీరోయిన్ గా భావన ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక దర్శకుడు శ్రావణ్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఏ ఇద్దరి పరిచయం యాధృచ్చికం కాదు అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. 

రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ పాత్రల మధ్య లవ్ .. ఎమోషన్స్ ను సున్నితంగా ఆవిష్కరించారు. రెండు ఆత్మలు కలిసి సాగించే ప్రయాణంగా ఈ కథ కనిపిస్తోంది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నారు.

More Telugu News