Akhil: చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ చేయాలనుంది: అఖిల్

Agent movie press meet

  • ఈ నెల 28న విడుదలవుతున్న 'ఏజెంట్'
  • ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న అఖిల్
  • 'మనం'లాంటి సినిమా మరోసారి చేయలేమని వ్యాఖ్య 
  • చైతూతో కలిసి నటించాలని ఉందని వెల్లడి 

అఖిల్ హీరోగా చేసిన భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకురావడానికి 'ఏజెంట్' రెడీ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ చురుగ్గా పాల్గొంటున్నాడు. 

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. 'ఏజెంట్' యాక్షన్ మూవీ అయినప్పటికీ, దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయి" అన్నాడు. ఫ్యామిలీతో కలిసి నటించే విషయాన్ని గురించి స్పందిస్తూ .. 'మనం' లాంటి స్క్రిప్టులు తరచుగా చేయడం సాధ్యం కాదు. కావాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే కాంబినేషన్ కి ఉన్న విలువ పోతుంది" అని చెప్పాడు. 

" నేను మా అన్నయ్య కలిసి నటించడానికి అవకాశం ఉన్న కథ ఇంతవరకూ దొరకలేదు. అలాంటి కథ కుదిరితే తప్పకుండా అన్నయ్యతో చేస్తాను. మల్టీ స్టారర్ సినిమాలను గురించి నేను ఆలోచన చేయలేదుగానీ, ఒకవేళ చేయవలసి వస్తే మాత్రం చరణ్ తో కలిసి చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను" అని అన్నాడు. 

Akhil
Sakshi Vaidya
Agent Movie
  • Loading...

More Telugu News