Salman Khan: వెంకీ, సల్మాన్ కోసం డీఎస్పీ హుషారైన పాట

Lets Dance Chotu Motu is composed by DSP for Kisi Ka Bhai Kisi Ki Jaan

  • కిసీకా భాయ్ కిసికా జాన్ చిత్రంలో నటించిన వెంకీ, సల్మాన్
  • ‘లెట్స్ డ్యాన్స్ చోటు మోటు’ పాటకు దేవిశ్రీ స్వరాలు
  • రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమా

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసి కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అజిత్ కథానాయకుడిగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వీరమ్’కు ఇది రీమేక్. ఇదే చిత్రం పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో ‘కాటమరాయుడు’గా రీమేక్ అయింది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేయకుండా కేవలం మూల కథను తీసుకొని హిందీకి తగ్గట్టు భారీ మార్పులు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. అందుకు తగ్గట్టుగానే బడా స్టార్లతో తెరకెక్కించాడు ఫర్హద్ సమ్జీ. 

ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఓ పాటలో సల్మాన్, వెంకీ, పూజాతో కలిసి స్టెప్పులు వేశాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘లెట్స్ డ్యాన్స్ చోటు మోటు’ అనే పాటకు సౌతిండియా స్టయిల్లో సల్మాన్, వెంకీ లుంగీ, చొక్కా వేసుకొని హుషారుగా స్టెప్పులు వేశారు. ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. చిత్రం కోసం సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) దీన్ని కంపోజ్ చేశారు. పాటను కూడా ఆయనే ఆలపించారు.

More Telugu News